కొత్త ఫొటో గురూ!

Nayanthara and Vignesh Shivan's new photo is going viral - Sakshi

తమిళసినిమా: అగ్రనటి నయనతారతో అంత క్లోజ్‌గా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? గుర్తు పట్టే ఉంటారులే. ఎందుకుంటే ఈ జంట ప్రెమిలీయమే కథా!  అలాగని నయనతారతో సన్నిహితంగా ఉన్నవ్యక్తి నటుడు అనుకునేరు. ఆయన ఆమె ప్రేమికుడుగా ప్రచారంలో ఉన్న యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు బయట పడకపోయినా చాలాసార్లు అలాంటి భావాన్ని వ్యక్తం చేసేలా ప్రవర్తిస్తున్నారు. నయనతార పుట్టిన రోజుకు విఘ్నేశ్‌శివ శుభాకాంక్షలు తెలపడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిసి అందమైన నగరం ప్యారిస్‌ చెక్కేయడం, క్రిస్మస్‌ పండుగను కలిసి జరుపుకోవడం లాంటి చర్యలు వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

అన్నిటికీ మించి నయనతార, విఘ్నేశ్‌శివ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. తాజాగా మరోసారి ఈ ప్రేమజంట కలిసి ఎంజాయ్‌ చేసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా నయనతార, విఘ్నేశ్‌శివ ఒకటై తీసుకున్న ఆ కొత్త ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. విశేషమేమిటంటే వీరు ధరించిన టీషర్టులపై వారి పేర్లు ప్రతిబించేలా వీ ఎన్‌ అనే ఆంగ్ల అక్షరాలు చోటు చేసుకున్నాయి. అరమ్, వేలైక్కారన్‌ చిత్రాల విజయాలతో మంచి జోష్‌ మీద ఉన్న నయనతార తాజాగా అజిత్‌తో విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అదేవిధంగా సూర్య హీరోగా విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించిన తానాసేర్నద కూట్టం సక్సెస్‌ కావడంతో ఆ దర్శకుడు మంచి ఖుషీలో ఉన్నారు.
దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top