నరకాసురుడు ఎవరు?

నరకాసురుడు ఎవరు?


‘నేరమే నా నెత్తుటి వర్ణంరా... ద్రోహమే నా సృష్టిలో స్వర్గంరా...’ అంటూ ‘ధృవ’ సినిమాలో సై్టలిస్ట్‌ విలన్‌గా యాక్ట్‌ చేసి తనలోని కొత్త నటుణ్ణి బయటపెట్టారు అరవింద్‌ స్వామి. తాజాగా ఈ సై్టలిస్ట్‌ విలన్‌ తమిళ దర్శకుడు నరేన్‌ తెరకెక్కించనున్న ‘నరగాసురన్‌’లో యాక్ట్‌ చేయనున్నారు. ఇందులో సందీప్‌ కిషన్‌ యాక్ట్‌ చేస్తున్నారు.


డార్క్‌ అండ్‌ ఎమోషనల్‌ సస్పెన్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తెలుగులో ‘నరకాసురుడు’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు, ఇందులో అరవింద్‌ స్వామి, సందీప్‌ కిషన్, ఇంద్రజిత్, శ్రియ నటిస్తున్నట్లు దర్శకుడు నరేన్‌ ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. వెంటనే ‘గుడ్‌లక్‌ టు ఆల్‌ నరగాసురన్‌ టీమ్‌’ అని అరవింద్‌ ట్వీట్‌ చేశారు. మరి.. ఇందులో సందీప్‌ కిషన్‌ హీరోగా యాక్ట్‌ చేస్తున్నారా లేక మరేదైనా రోల్‌ చేస్తున్నారా? ఇంతకీ వెండితెర ‘నరకాసురుడు’ ఎవరో మరి?

Back to Top