సెప్టెంబర్‌లో  జెర్సీ వేస్తాడు

 Nani to play a cricketer in upcoming Telugu sports drama Jersey - Sakshi

స్టెతస్కోప్‌ పట్టుకున్న డాక్టర్‌ మరో రెండు నెలల్లో క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకొని మైదానంలో దిగుతారట. తెల్ల కోటు తీసేసి బ్లూ జెర్సీ ధరిస్తారట. విషయం ఏంటంటే.. నాని ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో డాక్టర్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా జూలైకి కంప్లీట్‌ కానుంది. ఆ తర్వాత ‘మళ్ళీరావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్‌ డ్రామా మూవీని నాని ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌లో స్టార్ట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు. ప్రస్తుతం నాగార్జునతో చేస్తోన్న మల్టీస్టారర్‌ మూవీ, బిగ్‌ బాస్‌ షోలతో బిజీగా ఉన్న నాని అవి రెండూ కంప్లీట్‌ చేసుకున్నాక ‘జెర్సీ’ సినిమాలో తన క్యారెక్టర్‌ కోసం క్రికెట్‌ ప్రాక్టీస్‌ కూడా చేయనున్నారట. 

1980–90ల మధ్యలో జరిగే ఈ స్టోరీలో నాని అర్జున్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ– ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసే పనిలో పడ్డారట గౌతమ్‌ తిన్ననూరి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top