అన్నమయ్య పాటతో నాని..?

అన్నమయ్య పాటతో నాని..?


డబుల్ హ్యాట్రిక్ సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. ఇటీవల నేనులోకల్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. రెండు సినిమాలు చేతిలో ఉండగానే మరో సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు.తనకు కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం నితిన్‌తో లై సినిమాను తెరకెక్కిస్తున్న హను, ఆ సినిమా పూర్తయిన తరువాత నాని సినిమా పనులు ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు ఓ క్లాసీ టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య పాటలోని 'అదిగో..అల్లదిగో..' అనే పదాలు టైటిల్‌గా ఫిక్స్ చేశారట. ప్రస్తుతానికి యూనిట్ సభ్యుల నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా నాని ఇమేజ్‌కి ఈ టైటిల్ కరెక్ట్‌గా సూట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.

Back to Top