‘జెర్సీ’ టీజర్‌ వచ్చేస్తోంది!

Nani Jersey Teaser On 12th January - Sakshi

దేవదాస్‌ లాంటి రొటీన్‌ కమర్షియల్‌ సినిమా తరువాత క్రికెటర్‌ పాత్రలో నటిస్తూ.. ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాని రెడీ అవుతున్నాడు. జెర్సీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవలె విడుదల చేసింది చిత్రబృందం. 

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 12న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాకు తమిళ సంచలనం అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కిరాక్‌ పార్టీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ నానికి జోడిగా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top