బాలయ్య కొత్త సినిమా లుక్‌!

Nandamuri Balakrishna Look In KS Ravikumar Film - Sakshi

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్‌ గ్యాప్‌ తరువాత కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. షూటింగ్ సమయంలో ఓ అభిమానితో బాలయ్య దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో చిత్రయూనిట్‌ అధికారికంగా లుక్‌ను రిలీజ్ చేశారు.

డిఫరెంట్ హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో ఉన్న బాలయ్య ఈ సినిమాలో అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లు నిరాశపరచటంతో బాలయ్య అభిమానులు ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కమర్షియల్‌ దర్శకుడిగా పేరున్న కేయస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top