చైతూ కోసం 1000 మెట్లు మోకాలిపై..

Naga Chaitanya Fans Climb 1000 Steps On Knees In tirupati - Sakshi

తన అభిమాన హీరో నాగచైతన్య సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 1000 గుడిమెట్లను మోకాళ్లపై ఎక్కాడో అభిమాని. చైతూ పుట్టిన రోజు(నవంబర్‌ 23) సందర్భంగా ఆయన ఈ పని చేశారు. శనివారం సింహాచలం ఆలయ మెట్లను మోకాలిపై ఎక్కిన సాగర్‌ అనే వ్యక్తి.. ఇదంతా వీడియో తీయించి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

'నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ 1000 మెట్లు మోకాలితో ఎక్కాను. ఈ కార్యక్రమంలో నాకు తోడుగా ఉన్న బొబ్బిలి అక్కినేని ఫ్యాన్స్‌కు థాంక్స్‌' అంటూ నాగచైతన్య, సమంత‌, నాగార్జునను ట్యాగ్‌ చేశారు. ఈ వీడియోపై సమంత స్పందించారు. తమపై అభిమానంతో గుడిమెట్లు ఎక్కినందుకు ధన్యవాదాలు చెప్పారు. 'ఇది నమ్మశక్యం కాని నిజం.. మాటలు రావడం లేదు. దయచేసి మీరు మమ్మల్ని కలవండి' అని సామ్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం నాగచైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌. మరోవైపు రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. షూటింగ్‌ పూర్తి కావోస్తుంది. కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top