నాగచైతన్య మనసు మార్చుకున్నాడా..?

నాగచైతన్య మనసు మార్చుకున్నాడా..?


యుద్ధం శరణం సినిమా రిజల్ట్ తో నాగచైతన్య మనసు మార్చుకున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. సవ్యసాఛి పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమానే తన నెక్ట్స్ సినిమా అంటూ కన్ఫామ్ చేశాడు. అయితే యుద్ధం శరణం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో చైతూ మనసు మార్చుకున్నాడట.సవ్యసాఛి కూడా యాక్షన్ జానర్ సినిమా కావటంతో మరో సారి రిస్క్ చేయటం ఇష్టం లేని అక్కినేని హీరో ఓ కామెడీ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చర్చల్లో ఉన్న మారుతి సినిమాను సవ్యసాఛితో పాటు సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమానే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. శర్వానంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన మహానుభావుడు ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి నాగచైతన్య నిర్ణయం తీసుకోనున్నాడు.

Back to Top