ఫిట్‌ అండ్‌ ఫైట్‌!

nag-ram gopal varma movie updates - Sakshi

...అంతేగా మరి! ఫైట్‌ చేయాలంటే ఫిట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్‌. అందుకని, నాగార్జున జిమ్‌లో జోరుగా వర్కౌట్స్‌ చేస్తున్నారట! ఎప్పుడూ ఫిట్‌గా ఉండే తెలుగు హీరోల్లో ఈ మన్మథుడు ఒకరు. మళ్లీ జిమ్‌లో ప్రత్యేకంగా వర్కౌట్స్‌ చేయడం ఎందుకు? అంటే... రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం! పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నాగార్జున పోలీస్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో రానటువంటి అవుట్‌ అండ్‌ అవుట్‌ స్టైలిష్‌ యాక్షన్‌ కథను వర్మ రెడీ చేశారట!

ఫైట్స్‌ ఎక్కువ ఉంటాయట! ఫుల్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ చదివిన నాగార్జున సిన్మా కోసం మరింత ఫిట్‌గా రెడీ కావాలని వర్కౌట్స్‌ చేస్తున్నారు. నాగచైతన్య పెళ్లి అయినప్పట్నుంచి ప్రతిరోజూ కొంత సమయం జిమ్‌కే కేటాయిస్తున్నారట నాగార్జున. ఈ నెల 20న ఈ సినిమా ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top