ట్రెండింగ్‌లో దీపికా ప్ర‌భాస్‌

Nag Ashwin Tweet On Deepika Padukone In Prabhas Movie - Sakshi

స్టార్ హీరో సినిమా అంటేనే అభిమానులు ప‌డి చ‌స్తారు. అలాంటిది ఇద్ద‌రు స్టార్‌లు క‌లిసి న‌టిస్తున్నారంటే ఆ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 'మ‌హాన‌టి' ఫేం  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపు దిద్దుకుంటున్న ప్ర‌భాస్ 21వ సినిమా నుంచి వ‌చ్చిన‌ లేటెస్ట్ అప్‌డేట్ అభిమానుల‌ను ఎగిరి గంతేసేలా చేస్తోంది. కార‌ణం.. ప్ర‌భాస్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. బాలీవుడ్ దునియాలో త‌న‌కంటూ ఓ లెక్క రాసి పెట్టుకున్న దీపికా ప‌దుకొనె. దాదాపు అంద‌రు స్టార్లతో క‌లిసి న‌టించ‌డ‌మే కాక ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేసేందుకు ఆమె ఎప్పుడూ వెనుకాడ‌లేరు. ఆమె తీసుకునే‌ పారితోష‌కాన్ని కొంద‌రు హీరోలు కూడా అందుకోలేరు. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ సినిమాలో న‌టించేందుకు దీపిక‌ను ఒప్పించ‌డం కోసం నాగ్ అశ్విన్ టీమ్ బాగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. (‘ఆ వీడియో బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి?’)


దీనిపై నాగ్ ఏమంటున్నారో తెలుసా? "రాజుకు స‌రిప‌డే రాణి కావాలి క‌దా మ‌రి.. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణ‌యమిది. ఇక పిచ్చెక్కిచ్చేద్దాం" అంటూ ట్వీట్ చేశారు. అయితే కొంద‌రు అభిమానులు మాత్రం ఇంత ఊరించి చివ‌రికి ఉసూరుమ‌నిపించారు అని పెద‌వి విరుస్తున్నారు. ప్ర‌భాస్‌తో జోడీ క‌ట్టేది దీపికేన‌న్న విష‌యం త‌మ‌కు‌ గ‌తంలోనే ఉప్పందిందంటున్నారు. ఇంత‌దానికి అంత బిల్డ‌ప్ ఇచ్చార‌ని విమ‌ర్శిస్తున్నారు. 'ఏదైతేనేం.. దీపిక అని ఇప్పుడు ప‌క్కాగా క‌న్‌ఫార్మ్ అయింది.. ప్ర‌భాస్‌తో న‌టించాలంటే ఆమాత్రం రేంజ్ ఉండాలి' అని మ‌రికొంద‌రు డార్లింగ్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక 'బాహుబ‌లి రికార్డులు బ‌ద్ద‌లే'నంటూ ట్వీట్లు చేస్తున్నారు. అభిమానుల ట్వీట్ల వ‌ర్షంతో ట్విట‌ర్‌లో #DeepikaPrabhas ట్రెండింగ్ అవుతోంది. (భర్తను ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top