తెలుగు హీరోతో కేజీఎఫ్ డైరెక్టర్!

బాహుబలి తరువాత అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన సౌత్ సినిమా కేజీఎఫ్. కన్నడ ఇండస్ట్రీలో రూపొందించిన ఈ సినిమా తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ మంచి విజయం సాధించింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సీక్వెల్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
తొలి భాగం ఘనవిజయం సాధించటంతో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తం అడ్వాన్స్‌గా ఇచ్చి ప్రశాంత్‌తో తదుపరి చిత్రం చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కేజీఎఫ్‌లో హీరోయిజాన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేసిన ప్రశాంత్, తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి