నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు | Music director Prakash Nikki turns producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు

Oct 17 2016 2:29 AM | Updated on Sep 4 2017 5:25 PM

నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు

నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు

సంగీత దర్శకులు కథానాయకులుగా మారడం, నిర్మాతలవడం చూస్తున్నాం. ఆ వరుసలో మరో సంగీత దర్శకుడు ప్రకాశ్ నిక్కీ చేరారు.

సంగీత దర్శకులు కథానాయకులుగా మారడం, నిర్మాతలవడం చూస్తున్నాం. ఆ వరుసలో మరో సంగీత దర్శకుడు ప్రకాశ్ నిక్కీ చేరారు. కోయంబత్తూర్‌కు చెందిన ఈయన కొచ్చిలో సంగీత పాఠాలు చదివారు. ఆ తరువాత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ వద్ద కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. అనంతరం జీవా, శ్రీయ జంటగా నటించిన రౌద్రం చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత కళం చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్రకాశ్ నిక్కీకి పలు అవకాశాలు వచ్చినా మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తుండగా దర్శకుడు విజయ్ కథ చెప్పడానికి వచ్చారట.
 
 దీని గురించి ప్రకాశ్ నిక్కీ తెలుపుతూ విజయ్ చెప్పిన కథ చాలా నచ్చేసిందన్నారు. తనే నిర్మాతగా ఆ కథను తెరకెక్కించేందుకు నిర్ణయిం చుకున్నట్లు చెప్పారు. ఇది కొత్త ట్రెండ్‌లో సాగే క థా చిత్రంగా ఉంటు ందన్నారు. సీనియర్ నటుడు చారుహాసన్ డార్కింగ్ ప్రపంచ డాన్‌గా ప్రధాన పాత్ర పోషించడం విశేషం అన్నారు. ఆయనతో పాటు మొత్తం 12 పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రానికి సూదుకవ్వుం చిత్రానికి సహాయ కెమెరామన్‌గా పనిచేసిన రాజా చాయాగ్రాహకుడిగానూ, లెనిన్ శిష్యుడు సుధ ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement