పవర్‌ఫుల్‌ డాన్‌!

Mohanlal to play underworld don in Shaji Kailas film - Sakshi - Sakshi - Sakshi

ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ గొడవ పడుతున్నారు. వారిలో ఒకరి ఫోన్‌ రింగ్‌ అయ్యింది. అంతే... ప్రాబ్లమ్‌ ఫినిష్‌. ఆ ఫోన్‌ చేసిందెవరో కాదు... ఓ డాన్‌. ఒక్క ఫోన్‌ కాల్‌తోనే అంతా సద్దుమణిగిందంటే అతనెంత పవర్‌ఫుల్‌ డాన్‌ అయ్యింటాడో ఊహించవచ్చు. మలయాళ దర్శకుడు షాజీ కైలాశ్‌ అచ్చు ఇలాంటి వపర్‌ఫుల్‌ పాత్రలోనే మోహన్‌లాల్‌ను తెరపై చూపించబోతున్నారన్నది మాలీవుడ్‌ టాక్‌. వీరిద్దరి కాంబినేషన్‌ 1997లో ‘అరమ్‌ తంబురాన్‌’ సినిమాతో స్టార్ట్‌ అయ్యింది.

ఆ తర్వాత ‘నరసింహం, తాండవం, నాట్టురాజావు, బాబా కల్యాణీ, అలీభాయ్‌’ వంటి చిత్రాలు వచ్చాయి. 2009లో వచ్చిన ‘రెడ్‌ చిల్లీస్‌’ తర్వాత మెహన్‌లాల్, షాజీ కైలాశ్‌ దర్శకత్వంలో మరో సినిమా రూపొందలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఎనిమిదో సారి వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని టాక్‌. మోహన్‌లా ల్‌ని పవర్‌ఫుల్‌ డాన్‌గా చూపించడానికి షాజీ రంగం సిద్ధం చేశారట. ఈ గెటప్‌లో ఒదిగిపోవడానికి మోహన్‌లాల్‌ కూడా కసరత్తులు చేస్తున్నారట. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top