తగ్గారు.. పెంచారు!

Mohanlal Age is now a Fifty Plus - Sakshi

మోహన్‌లాల్‌ ఏజ్‌ ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్‌ అంటే నమ్మలేమేమో. అంతలా న్యూ లుక్‌లోకి మారారాయన. సినిమాల పట్ల మా సూపర్‌ స్టార్‌కి అంత డేడికేషన్‌ అని మోహన్‌లాల్‌ అభిమానులు అంటున్నారు. ‘ఒడియమ్‌’ సినిమా కోసం ఆయన తగ్గిన విషయం తెలిసిందే. ఈ లుక్‌ షూటింగ్‌ పూర్తయ్యే వరకూ మోహన్‌లాల్‌ వేరే సినిమా ఒప్పుకోరేమో అని కొంతమంది ఊహించారు. అలాంటిదేం లేదు. ఓ కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు.

బాలీవుడ్‌ దర్శకుడు అజయ్‌ వర్మ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ నటించనున్న తాజా సినిమా షూటింగ్‌ మంగళవారం ముంబైలో మొదలైంది. ‘‘అజయ్‌ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతున్న నా కొత్త సినిమా షూటింగ్‌ కోసం ముంబైలో ఉన్నాను. ఈ యాక్షన్‌ అండ్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌లో సెంట్రల్‌ క్యారెక్టర్‌లో నటించబోతున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్‌. ఈ సినిమా, ‘ఒడియన్‌’ కాకుండా ఆల్రెడీ ‘కయ్యాకులమ్‌ కొచ్చిన్‌’ చిత్రంలో మోహన్‌లాల్‌ నటిస్తున్నారు. ఏదేమైనా బరువు తగ్గిన మోహన్‌లాల్‌ వరుసగా సినిమాలు కమిట్‌ అవుతూ జోరు పెంచారనిపిస్తోంది కదూ! 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top