త్వరలో సెట్స్ మీదకు సై..రా..!

త్వరలో సెట్స్ మీదకు సై..రా..!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ సై రా నరసింహారెడ్డి. తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలువురు పరభాష నటులు నటించనున్నారు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులుగా గుర్తింపు తెచ్చుకున్న వారు  పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజస్థాన్, పొల్లాచ్చి ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ఆ పనులు పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top