రస్టిక్‌ ఎలిమెంట్స్‌తో మెగా హీరో మూవీ

Mega Hero Vaishnav Tej Movie Opening - Sakshi

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్  రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయ దుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి,  మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ని ప్రారంభించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. నాగబాబు , అల్లు అర్జున్ స్క్రిప్ట్ ని అందజేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ సంస్థ గురించి, ఆ సంస్థ సాధించిన విజయాల గురించి అందరికి తెలిసిందే.. కొత్త వారి ప్రతిభను ప్రోత్సహించే దిశగా సుకుమార్ రైటింగ్స్ సంస్థ ద్వారా సుకుమార్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. రామ్ చరణ్ చేసిన ‘రంగస్థలం’ సినిమా తో ఈ సంస్థతో , సుకుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. మంచి మనసున్న వ్యక్తులు ఈ సంస్థ నిర్మాతలు. వీరికి సుకుమార్ కలిసి వైష్ణవ్ తేజ్ తో  ఓ మంచి సినిమాను తీయబోతున్నారు. ఇంతచక్కటి అవకాశం ప్రారంభంలోనే లభించడం అదృష్టం. డైరెక్టర్ బుచ్చి బాబు చాల కొత్త కథ రాశాడు. ఈ కథను నాకు నేరేట్ చేసినప్పుడు రస్టిక్ ఎలిమెంట్స్ కనిపించాయి. రంగస్థలం కథ చర్చల్లో బుచ్చిబాబు పాత్ర చాల ఉందని సుకుమార్ చాల సార్లు చెప్పారు. పెద్ద మనసున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు..

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది.. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది.. అద్భుతమైన కథ రాశాడు.. ఒక్క సిట్టింగ్ లోనే ఒకే చేసిన కథ ఇది. బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్ అవుతాడని ఖచ్చితంగా చెప్పగలను.. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ అని ఫిక్స్ అయ్యాడు. వేరే ఆప్షన్స్ చూడమన్నా వైష్ణవ్ ఈ సినిమా కి న్యాయం చేయగలడు అని ఒప్పించాడు. ఈ ప్రాజెక్ట్ ఇంతదూరం రావడానికి కారణం ఈ సినిమా కథే. మైత్రి మూవీ మేకర్స్ వారికి చాల థాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా ఇలాంటి కొత్త సినిమా చిన్న సినిమా ను నిర్మించడం వారికే చెల్లింది. కొత్తమ్మాయి మనీషా తెలుగమ్మాయి. చాల మందిని టెస్ట్ చేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు.. ఒక మంచి అమ్మాయి సినిమా కు ఎంపిక అయ్యింది.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న దేవిశ్రీప్రసాద్ కి చాలా థాంక్స్ అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. సుకుమార్ సర్ కి చాల థాంక్స్..థాంక్స్ కూడా సరిపోదు.. అంతకు మించి ఎదో చెప్పాలనిపిస్తుంది. నా మీద నమ్మకం ఉంచిన చిరంజీవి గారికి, మా అమ్మానాన్నలకు చాలా థాంక్స్.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో మంచి సినిమా తీస్తాను. ఎవరైనా దేవుడు ముందు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కానీ నేను మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్‌గా కావాలి సినిమా నిలబెడతాడు అని కోరుకుంటాను. వైష్ణవ్ గారు ఈ సినిమా కి యాప్ట్ హీరో. సినిమా చాల బాగుంటుంది.. కొత్తగా ఉంటుంది.. అందరు చూడండి అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top