స్నేహం కోసం!

Meet professor Venkatesh - Sakshi

వెరైటీ స్క్రిప్ట్‌ ఉందా? అందులో రోల్‌ డిఫరెంట్‌గా ఉందా? అయితే ఆలస్యం ఎందుకు? అనే టైప్‌లో వెంకటేశ్‌ డిఫరెంట్‌ మూవీస్‌ సెలక్ట్‌ చేసుకుంటున్నారు. కథ, క్యారెక్టర్‌ నచ్చితే భాష ఏదైనా ఫర్వాలేదనుకుంటున్నారట. ఓ మలయాళ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. అయితే హీరోగా కాదట. టాలీవుడ్‌లో వెంకటేశ్‌ బిగ్‌ స్టార్‌.

అయినప్పటికీ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించనున్న ఓ మలయాళ మూవీలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించారట. నిజానికి మోహన్‌లాల్‌ నటించిన మలయాళ హిట్‌ మూవీ ‘దృశ్యం’ తెలుగు రీమేక్‌లో వెంకీ నటించారు. ఇక్కడ కూడా ఈ సినిమా హిట్టయింది. ఆ సినిమా అప్పటినుంచి వెంకీ–మోహన్‌లాల్‌ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ కొనసాగుతోందట. ఆ స్నేహం కోసం వెంకీ మాలీవుడ్‌లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నది ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top