ప్రేమకు ప్రకృతి తోడైతే...

malli malli chusa releasing shortly - Sakshi

అనురాగ్‌ కొణిదెన హీరోగా, శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా సాయిదేవ రామన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా  నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్‌కు సిద్ధమయింది. సాయిదేవ రామన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కథతో తెరకెక్కిన సినిమా ఇది.

అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. కోటేశ్వరరావుగారు ఎంతో సపోర్ట్‌ చేస్తూ వచ్చారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం, సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. ఇటీవల సినిమా చూశాం. ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని కోటేశ్వరరావు.కె చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయి సతీష్‌ పాలకుర్తి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top