పేరు మార్చే ఆలోచనలో మహేష్‌..!

Mahesh Koratala Bharat Ane Nenu Movie Title May Change - Sakshi

స్పైడర్‌ సినిమాతో నిరాశపరిచిన మహేష్‌ బాబు తన నెక్ట్స్‌ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే సంక్రాంతికి అనుకున్న సినిమాను ఏకంగా వేసవికి పోస్ట్‌పోన్‌ చేశాడు. మహేష్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా మహేష్‌ ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని భావిస్తున్నాడట. చిత్రయూనిట్‌ భరత్‌ అనే నేను టైటిల్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా.. మీడియాలో వస్తున్న వార్తలను మాత్రం ఎప్పుడూ ఖండించలేదు. దీంతోఇదే  మహేష్‌ కొత్త సినిమా టైటిల్‌ అని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌.

అయితే మహేష్‌ మాత్రం భరత్‌ అనే నేను టైటిల​ బాగానే ఉన్న మాస​ అపీల్‌ లేదని భావిస్తున్నాడట. స్పైడర్‌ విషయంలో కూడా టైటిల​ వల్ల నష్టం జరిగిందని భావిస్తున్న సూపర్‌ స్టార్‌ ఈ సారి పొరపాటు జరగకూడాదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తాజాగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన సమయంలో కూడా కేవలం మహేష్‌ 24 అని మాత్రం చెప్పారు గానీ.. ఎక్కడా టైటిల్‌ను ప్రస్తావించలేదు. దీంతో త్వరలోనే మహేష్‌ కొరటాల సినిమా టైటిల్‌పై కొత్త ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top