గానా బజానా

mahesh babu new movie updates - Sakshi

థియేటర్‌కి వెళ్లారు హీరో మహేశ్‌బాబు. ఏ థియేటర్‌కి వెళ్లారు? ఆ థియేటర్‌ ఎక్కడుంది? అంటే.. హైదరాబాద్‌లో ఓ థియేటర్‌కి వెళ్లారు. ఏ సినిమా చూడ్డానికి వెళ్లారు? అంటే.. తన సినిమా కోసమే. మహేశ్‌బాబు సినిమా ఏ థియేటర్‌లోనూ ఆడటంలేదు కదా అనుకుంటున్నారా? మహేశ్‌ వెళ్లింది.. సినిమా చూడ్డానికి కాదు.. షూటింగ్‌ చేయడానికి.  ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని కథానాయిక. ఒమెన్‌ విహార యాత్రల తర్వాత  షూట్‌లో పాల్గొన్నారు మహేశ్‌. హైదరాబాద్‌లో మహేశ్, కియారాలపై సాంగ్‌ షూట్‌ చేశారు. ఆ సాంగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే థియేటర్‌ సీక్వెన్స్‌లో మహేశ్‌బాబు పాల్గొన్నారట. థియేటర్లో గానా బజానా అదిరిపోయిందట. అసలు విషయం అది. పొంగల్‌కి ఫస్ట్‌లుక్‌ కాకుండా డైరెక్ట్‌గా టీజర్‌ను రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top