క్లాసులు ముగిశాయి

mahesh babu Dehradun schedule to end soon - Sakshi

కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఇప్పుడే స్టార్ట్‌ అవుతున్నాయి కదా అప్పుడే సెలవులు ఏంటీ? అని ఆలోచించకండి. ఇది డెహ్రాడూన్‌లో మహేశ్‌బాబు వెళ్లిన సినిమా కాలేజీ గురించి చెబుతున్నాం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్‌ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ డెహ్రాడూన్‌లో మొదలైన సంగతి తెలిసిందే.

మహేశ్, పూజా, నరేశ్‌లపై కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిందని సమాచారం. అంటే.. డెహ్రాడూన్‌ కాలేజీలో క్లాసులు ముగిశాయన్నమాట.‘‘డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశాను. దాదాపు 19 రోజులు షూట్‌లో పాల్గొన్నాను’’ అంటూనే ఇది నా ప్యాకప్‌ డ్యాన్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు పూజ. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ యూఎస్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. 2019 ఏప్రిల్‌ 5న చిత్రం విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top