మన సినిమా కోసం వెయిటింగ్‌ : మహేష్‌

Mahesh Babu Birth Day Wishes To Sukumar - Sakshi

రంగస్థలం లాంటి వినూత్న సినిమాను తెరకెక్కించి తనలోని టాలెంట్‌ను మరోసారి నిరూపించుకున్నారు సుకుమార్‌. ఈ లెక్కల మాష్టారు పుట్టినరోజు నేడు (జనవరి 11). కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి డిఫరెంట్‌ సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్‌ను అందుకుంటున్న ఈ డైరెక్టర్‌కు సినీ ప్రముఖులు విషెస్‌ చెబుతున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నెనొక్కడినే మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మళ్లీ మహేష్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. నేడు సుకుమార్‌ బర్త్‌డే సందర్భంగా మహేష్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘మోస్ట్‌ హంబుల్‌, సూపర్‌ టాలెంటెడ్‌ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్‌’ అని అన్నారు. మహేష్‌ ప్రస్తుతం మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top