మళ్లీ వేసవి బరిలో...

Mahesh Babu 25th Film Shooting At Dehradun  - Sakshi

ఈ ఏడాది సమ్మర్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో మహేశ్‌ హీరోగా నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఒకటి. ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్‌ బాక్సాఫీస్‌పై మళ్లీ మహేశ్‌ గురిపెట్టారా? అంటే సంకేతాలు అలానే ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ అదితీరావు హైదరీ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని టాక్‌. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్‌ చేశారట. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top