‘మాయాన్‌’ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ

Maayan First Look Released - Sakshi

మాయాన్‌ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ విడుదల కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. బాక్స్‌ క్రో స్టూడియోస్‌ సంస్థ అధినేత జే.రాజేశ్‌ కన్నన్, జీకేవీఎం.ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ దట్టో కణేశ్‌మోహన్‌ సుందర్‌ సయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మాయాన్‌. తమిళం, ఆంగ్లం భాషల్లో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వినోద్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు, దర్శకుడు రాజేశ్‌ కన్నన్‌ చిత్ర వివరాలను తెలుపుతూ మనందరం ఆలయాల్లో కొలువుదీర్చి కొలిచే దైవ స్వరూపుడే మాయాన్‌ అన్నారు. ఆ మాయాన్‌ గురించి చెప్పాలంటే మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగింది.

తమిళం గురించి చెప్పాలంటే 25వేల సంవత్సరాల చరిత్ర కలిగింది. అయితే శివుడి గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువ. అలా శివుడే మాయాన్‌ అని తాను అంటానని అన్నారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు ఆంగ్లంలోనే తెరకెక్కించడానికి కారణం ఈ చిత్రం కథ ప్రపంచ దేశాలన్నింటికి సరిపోయేదిగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని మన భాషలో చెప్పడం కంటే ఆంగ్లభాషలో తెలియజేయడం బాగుంటుందన్న తన సూచనను సహ నిర్మాతలు అంగీకరించడంతో రెండు భాషల్లోనూ రూపొందిస్తున్నామని చెప్పారు. చిన్న తనంలో తప్పు చేస్తే దేవుడు దండిస్తాడు అని పెద్దలు చెబుతూ పెంచుతారన్నారు. అది నిజమా? కాదా? లాంటి అంశాలను ఈ చిత్రంలో చర్చించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇండియాకు చెందిన మలేషియా రాయబారి లోకిదాసన్‌ ధన్‌రాజ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దీనికి జేమ్స్‌రుబార్ట్‌ నేపథ్యసంగీతాన్ని, ఛాయాగ్రహణం అరుణ్‌ప్రసాధ్‌ అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top