ఆస్వాదించడం నేర్చుకోండి

Learn to enjoy says kajal agarwal - Sakshi

‘‘రేపు ఇది చేయాలి. వచ్చే నెల్లో ఈ గోల్‌ రీచ్‌ అవ్వాలి. ఆ తర్వాత ఇంకోటి. ఇలా ఉంటుంది కొంత మంది షెడ్యూల్‌ లిస్ట్‌. దేనికైనా పంచవర్ష ప్రణాళికతో సిద్ధంగా ఉంటారు. అది తప్పు కాదు. కానీ రేపటి గురించి ఆలోచించి అనవరంగా ఈ క్షణాన్ని వృ«థా చేయొద్దు’’ అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ విషయం గురించి కాజల్‌ మాట్లాడుతూ– ‘‘లైఫ్‌లో నేనేదీ ప్లాన్‌ చేసుకోలేదు. చేసుకోను కూడా. ఈ ప్లానింగ్‌ గేమ్స్‌ ఆడటమంటే పెద్దగా నచ్చదు కూడా. ఇలా వర్క్‌ చేస్తే రెండేళ్లలో అక్కడుంటాను.

ఈ పని చేస్తే అలా అవుతుంది అని స్ట్రాటజీలు ఎప్పుడూ వేసుకోలేను. ఈ మూమెంట్‌లో ఉన్నామంటే ఈ మూమెంట్‌ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగతాదంతా అప్రస్తుతం. మరుసటి రోజు గురించి ఆలోచిస్తే ఈ నిమిషాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోలేం కదా. ఫ్లోని బట్టి వెళ్లిపోవడమే. ఈ క్షణాన్ని ఆనందిస్తున్నామా? ఆస్వాదిస్తున్నామా? అన్నదే ముఖ్యం. అలా అని భవిష్యత్‌ గురించి ఆలోచించొద్దని అనడంలేదు. అదే పనిగా ఆలోచించి ఈ క్షణం ఒత్తిడికి గురి కావొద్దు అంటున్నాను’’ అని తన చిట్కాను పంచుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top