చిక్కుల్లో లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi  escape to movie shoot

తమిళసినిమా: అందగత్తె నటి లావణ్య 100% చిక్కుల్లో కూరుకుపోయింది. సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠి తాజాగా చిక్కుల్లో పడింది. ఈ అమ్మడు నటించడానికి అంగీకరించిన చిత్ర షూటింగ్‌కు డుమ్మా కొట్టడంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలు లావణ్యపై చర్యలకు సిద్ధమయ్యారు. వివరాల్లోకెళితే తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్‌ చిత్రాన్ని తమిళంలో చంద్రమౌళి దర్శకత్వంలో 100% కాదల్‌ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ఇందులో నటి లావణ్య త్రిపాఠిని నాయకిగా ఎంపిక చేశారు.

ఈ చిత్ర షూటింగ్‌ను లండన్‌లో నిర్వహించడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేశారు. అయితే అంతా రెడీ అయ్యి చిత్ర యూనిట్‌ లండన్‌కు బయలుదేరుతున్న సమయంలో లావణ్య డుమ్మా కొంటిందట. దీంతో ఆగ్రహం చెందిన చిత్ర దర్శకుడు చంద్రమౌళి లావణ్యపై దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో పిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడం వల్ల తాము చాలా నష్టపోయామని అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి లావణ్య త్రిపాఠిపై తామే మరో విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరి ఈ చిక్కుల నుంచి నటి లావణ్య త్రిపాఠి ఎలా బయట పడుతుందో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top