అమ్మ చీర కట్టుకుంటా! – లావణ్యా త్రిపాఠి

 Lavanya Tripathi Diwali Celebrations in dehradoon

షూటింగ్స్‌కి చిన్న బ్రేక్‌ తీసుకుని, డెహ్రాడూన్‌ వెళ్లా. గురువారం మా ఇంట్లో లక్ష్మీపూజ చేస్తాం. చాలా పెద్ద పూజ అన్నమాట. దీపావళి కోసం ప్రత్యేకంగా షాపింగ్‌ ఏమీ చేయలేదు. మా అమ్మగారి పట్టుచీర కట్టుకుంటాను. దీపావళి ముందు రోజు ధనత్రయోదశికి బంగారం కొంటారు కదా. కానీ, మాకు జస్ట్‌ గోల్డ్‌ మాత్రమే కాదు... వెండి, ఇత్తడి, కిచెన్‌లో వాడే వస్తువులు... ఏదైనా కొనొచ్చు.

మా అమ్మగారు కిచెన్‌ కోసం భారీగా షాపింగ్‌ చేశారు. దీపావళి రోజు పూజ పూర్తయిన తర్వాత నా బుల్లి మేనల్లుడు, ఇతర కుటుంబం సభ్యులతో కలసి ఒక అనాథాశ్రమానికి వెళ్లాలనుకుంటున్నాను. అక్కడి పిల్లల కోసం స్వీట్స్, క్రాకర్స్‌ తీసుకున్నాం. నేను మాత్రం కాల్చను. పర్యావరణానికి హాని కలిగించేవి చేయకూడదు కదా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top