శాండిల్‌వుడ్‌కు లావణ్య త్రిపాఠి

శాండిల్‌వుడ్‌కు లావణ్య త్రిపాఠి


నటి లావణ్య త్రిపాఠి తాజాగా శాండిల్‌వుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ ఉత్తరప్రదేశ్‌ బ్యూటీ చాలా కాలం క్రితమే కోలీవుడ్‌లో బ్రహ్మ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. అయితే ఆ చిత్రం నిరాశపరచడంతో అమ్మడిని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు జంప్‌ చేసింది. అక్కడ నాగార్జున వంటి ప్రముఖ హీరోతో పాటు, నాని, శర్వానంద్, శిరీష్, నాగచైతన్య వంటి యువ హీరోలతోనూ జతకట్టే అవకాశాలను దక్కించుకుని మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.నాగచైతన్యతో రొమాన్స్‌ చేసిన వేడుక చూద్దాం రారండోయ్‌ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా మాయవన్‌ అనే చిత్రంతో కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యి ఆ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది. సందీప్‌కిషన్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత సీవీ.కుమార్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై నటి లావణ్య త్రిపాఠి చాలా ఆశలు పెట్టుకుంది. తాజాగా శాండిల్‌వుడ్‌లోకి రంగప్రవేశం చేసింది. అక్కడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్, సుధీప్‌ కలిసి నటిస్తున్న దివిలన్‌ అనే చిత్రంలో లావణ్య నటిస్తోంది. ఆరంభంలో హిందీ సీరియళ్లలో నటించిన ప్రస్తుతం మూడు పదుల వయసుకు చేరువైతోందన్నది గమనార్హం. ఇంకా పెళ్లి ఊసెత్తకుండా నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తోంది.

Back to Top