వాస్తవ సంఘటనతో...

Lakshman Murari creative team next movie - Sakshi

‘బందూక్‌’ లాంటి సందేశాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన లక్ష్మణ్‌ మురారి క్రియేటివ్‌ టీమ్‌ నుండి నూతన చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలనటుడిగా అలరించిన లక్ష్మణ్‌ మురారి తనయుడు ప్రియాన్ష్‌ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. కాకతీయ ఇన్నోవేటివ్స్‌ పతాకంపై లక్ష్మణ్‌ మురారి, రమేష్‌ మాదాసు నిర్మించనున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు లక్ష్మణ్‌ మురారి, రమేష్‌ మాదాసు మాట్లాడుతూ– ‘‘1980లో జరిగిన ఒక వాస్తవ సంఘటన నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న చిత్రమిది. నిత్యం నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉండే ఇరవయ్యేళ్ల కుర్రాడి జీవితంలో అనుకోకుండా వచ్చిన మార్పులకు కారణం ప్రేమ. +2 అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. డ్యా¯Œ ్స, కరాటే, బాస్కెట్‌ బాల్, ఫొటోగ్రఫీలో ప్రియాన్ష్‌కి మంచి నైపుణ్యం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, కెమెరా: రాహుల్‌ మాచినేని.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top