స్నేహితురాలి మృతిపై కమల్‌, రజనీ..!

Kollywood Film Stars after Sridevis death - Sakshi

శ్రీదేవి మృతి పట్ల కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌ హాసన్‌లు స్పందించారు. సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ శ్రీదేవి మరణవార్త షాక్‌కు గురిచేసిందని తెలిపారు. నేను మంచి స్నేహితురాలిని కోల్పోయాను. చిత్రసీమ మంచి నటిని కోల్పోయిందన్న రజనీ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ స్పందిస్తూ ‘వసంత కోకిల సినిమాలో చిన్న పాపలా, తల్లిలా తనను ఆడించిన నాకు.. శ్రీదేవి మరణవార్త జీర్ణించుకోలేనిది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. 

స్టార్ హీరోయిన్‌ నయనతార మాట్లాడుతూ ‘ఓ మంచి నటి, దేశం గర్వించదగిన మహిళ, నటీమణులకు మార్గదర్శి అయిన శ్రీదేవి మృతి అందరికీ తీరనిలోటు’ అన్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, సీనియర్ హీరోయిన్‌ ఖుష్భూ సుందర్‌, అదితిరావ్‌ హైదరీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు శ్రీదేవి మృతిపట్ల సంతాపం తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top