పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్!
ముంబాయి : ఒకప్పటి ప్రముఖ నటి ఆర్తి చాబ్రియా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ ట్యాక్స్ కన్సల్టెంట్ అయిన విశారద్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. గత మార్చిలో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. 2002లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'తుమ్సే ఆచ్చా కౌన్ హై' ఎంట్రీ ఇచ్చిన ఆర్తి చాబ్రియా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. గోపి (గోడమీద పిల్లి), ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి - వీధిలో కుమారి వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఆర్తి.. వెంకటేశ్ ‘చింతకాయల రవి’ సినిమాలో ఐటెం సాంగ్లో నర్తించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హొస్ట్గా చేసిన ఫియర్ ఫ్యాక్టర్ ప్రోగ్రాం 'ఖత్రోన్ కే ఖిలాడి' నాలుగోవ సీజన్లో విజేతగా నిలిచి.. పాపులర్ అయ్యారు.
తానేప్పుడు ప్రేమలో పడతానని అనుకోలేదని, కానీ, తన కుటుంబం మాత్రం తన సోల్మెట్ను తానే వెతుక్కుంటానని నమ్మేవారని తెలిపారు. కుటుంబం ఆశీర్వాదంతోనే తన సోల్మేట్ని వెతుక్కోగలిగానని చెప్పారు. విశారద్ తన భర్తగా రావడం తన అదృష్టమని, తాను ఎలాంటి భర్త రావాలని కోరుకున్నానో విశారద్ అచ్చం అలాగే ఉన్నాడని, పెళ్లి తర్వాత విశారద్ ఇండియాకి వచ్చేస్తున్నాడని ఆర్తి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు