డైలాగ్‌ చెప్పండి.. కేజీయఫ్‌2లో నటించండి

KGF2 Auditions To be held in Bengaluru - Sakshi

కన్నడ చిత్ర సీమలో సంచలన విజయం సాధించిన భారీ చిత్రం కేజీయఫ్‌. యువ కథానాయకుడు యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాండల్‌వుడ్‌లోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ పనులు ప్రారంభించారు చిత్రయూనిట్‌. తొలి భాగం షూటింగ్ సమయంలోనే కేజీయఫ్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన చిత్రయూనిట్ తాజాగా కేజీయఫ్2 షూటింగ్‌ ప్రారంభించారు.

అయితే కేజీయఫ్2లో న‌టించేందుకు ఆస‌క్తి ఉన్నవాళ్లు ఆడిష‌న్స్‌లో పాల్గొన‌వ‌చ్చని చిత్రయూనిట్ ఓ పోస్ట్‌ర్‌ విడుదల చేశారు. 8 నుండి 16 సంవ‌త్సరాల వ‌య‌స్సున్న పిల్లలు, 25 సంవత్సరాల పైబ‌డిన పురుషులు కావాలని ప్రకటన విడుదల చేశారు. అయితే ఆడిష‌న్‌కి వ‌చ్చే ముందు నిమిషం పాటు ఉన్న ఏదైన డైలాగ్‌ని నేర్చుకొని రావాల‌ని సూచించారు. ఈ ఆడిషన్స్‌ బెంగళూరులోని జీఎమ్‌ రిజాయిజ్‌లో ఏప్రిల్‌ 26న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగనున్నట్టు తెలిపారు. 

కేజీయఫ్ తొలి భాగం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, క‌న్నడ రియ‌ల్ స్టార్ ఉపేంద్రలు కేజీయఫ్‌ 2 నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top