సూపర్‌స్టార్‌తో కీర్తి?

Keerthy Suresh Next Movie With Rajinikanth - Sakshi

సినిమా: సూపర్‌స్టార్‌తో యువ నటి కీర్తీ సురేశ్‌ నటించబోతోందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. 2.ఓ, పేట చిత్రాల తరువాత రజనీకాంత్‌ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈయన ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న తొలి చిత్రం కావడంతో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే కాదు ఇది మురుగదాస్‌ మరోసారి సమాకాలీన రాజకీయాలపై సంధించబోతున్న అస్త్రంగా ఉంటుందని ప్రచారం హోరెత్తుతోంది. ఈ చిత్రానికి నర్కాలి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు, ఇందులో రజనీకాంత్‌ ముఖ్యమంత్రిగా నటించబోతున్నట్లు రకరకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఫిబ్రవరిలో చిత్రం సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పేట చిత్రంలో రెండు రకాల గెటప్‌లలో ప్రేక్షకులను, ముఖ్యంగా ఆయన అభిమానులను ఖుషీ పరిచిన రజనీకాంత్‌ను మురుగదాస్‌ కూడా యూత్‌ఫుల్‌గా చూపించబోతున్నారని ఇందులో ఆయకు జంటగా నటి కీర్తీసురేశ్‌ను నాయకిగా ఎంపిక చేసినట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే నిజం అయితే ఇటీవల విక్రమ్, విజయ్, విశాల్‌ వంటి సీనియర్‌ నటులతో నటించిన కీర్తీ ఈ సారి ఏకంగా ఆమె కంటే 42 ఏళ్లు పెద్ద అయిన రజనీకాంత్‌తో నటించనుండడం విశేషమే అవుతుంది. మరో విషయం ఏమిటంటే కీర్తీసురేశ్‌ తల్లి మేనక చాలా కాలం క్రితం నెట్రికన్ను అనే చిత్రంలో రజనీ సరసన కథానాయకిగా నటించారు. ఇప్పుడు కీర్తీతో కలిసి నటించడం నిజం అయితే తల్లికూతుళ్లతో హీరోగా నటించిన రికార్డు రజనీకాంత్‌ కేరీర్‌లో నిలిచిపోతుంది. ఇకపోతే కాలా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై తన కూతురు వయసున్న హీరోయిన్లతో నటించరాదని నిర్ణయించుకున్నట్లు రజనీకాంత్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు తన కూతుళ్ల కంటే చిన్నదైన కీర్తీసురేశ్‌తో ఎలా నటించడానికి ఓకే చెప్పారో? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏదేమైనా నార్కాలి చిత్ర వివరాలు అధికారకంగా వెల్లడయ్యేవరకూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top