మాజీ లవర్‌తో మళ్లీ చేయను!

మాజీ లవర్‌తో మళ్లీ చేయను!


‘అవును.. ఇదే నా ఆఖరి చిత్రం.. ఇకపై తనతో ఎప్పుడూ నటించను’ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు కత్రినాకైఫ్‌. అంతగా ఆమె ద్వేషిస్తున్న ఆ హీరో ఎవరు? అంటే.. ఇంకెవరూ.. ఒకప్పటి కత్రినా లవర్‌ రణబీర్‌ కపూర్‌.ఈ మాజీ లవర్స్‌ తాజాగా నటించిన ‘జగ్గా జాసూస్‌’ ప్రమోషన్‌లో రణబీర్‌తో కలిసి నటించనని కత్రినా స్పష్టం చేశారు. ‘‘రణబీర్‌తో పనిచేయడం కష్టంగా అన్పించింది. నాతో మరో సినిమాలో నటించనని రణబీర్‌ ‘జగ్గా జాసూస్‌’ సినిమా చిత్రీకరణ టైమ్‌లో చెప్పాడు. అందుకే, నేను కూడా అతనితో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా. రణబీర్‌తో ఇదే నా చివరి చిత్రం’’ అన్నారు.

Back to Top