‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ రేపే ప్రారంభం!

Kamal Haasan Shankar Indian 2 Movie Shooting Starts On 18th January - Sakshi

ఇండియన్‌ డైరెక్టర్‌ శంకర్‌, యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు (ఇండియన్‌) మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయానంలో నటించిన ఈ చిత్రంలో వృద్ద కమల్‌ హాసన్‌ పాత్ర ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది. 

లాచనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించేసిన చిత్రయూనిట్‌.. రేపటి (జనవరి 18) నుంచి ‘ఇండియన్‌ 2’ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో కమల్‌ హాసన్‌కు జోడిగా.. కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా కొరియన్‌ భామ సూజీ బే కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top