భారతీయుడు 2 : మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌

Kamal Haasan Shankar Bharateeyudu 2 Latest Update - Sakshi

లోక నాయకుడు కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సీక్వెల్‌లోనూ కమల్‌ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. తొలి భాగంలోనూ కమల్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించాడు.అయితే ఆ సినిమా క్లైమాక్స్‌లో ఒక కమల్‌ హాసన్‌ చనిపోతాడు. మరి సీక్వెల్‌లో ఇద్దరిని ఎలా చూపిస్తారో చూడాలి.

ఇప్పటికే  ‘సేనాపతి ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ఓ ప్రీలుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ముందుగా ఈ ప్రస్టీజియస్‌ సీక్వెల్‌ను దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కించేందుకు ప్లాన్‌చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం భారతీయుడు 2కు ఏయం రత్నం నిర్మాతగా వ్యవహరించనున్నారట. కమల్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top