లడ్డూ.. హల్వా లాగిస్తా – కాజల్‌ అగర్వాల్‌

Kajal Aggarwal plans to feast on these homemade delicacies this Diwali - Sakshi

మొన్నటివరకూ నిర్మల్‌లో ‘ఎమ్మెల్యే’ షూటింగులో ఉన్నా. దీపావళికి ముంబయ్‌లోని మా ఇంటికి వచ్చా. ప్రతి ఏడాది దీపావళికి... ముందు నాన్నగారి ఆఫీసులో, తర్వాత మా ఇంట్లో లక్ష్మీపూజ చేస్తాం. కుటుంబ సభ్యులు, చుట్టాలతో కలసి ఇంట్లో లంచ్‌ చేసిన తర్వాత బయటకు వెళ్తా. స్నేహితులతో కలసి రాత్రి డిన్నర్‌ చేస్తా.

మాది టిపికల్‌ పంజాబీ ఫ్యామిలీ. దీపావళి అంటే ఫుల్‌ ఫన్‌ అండ్‌ పార్టీస్‌. చిన్నప్పుడు నిషా, నేనూ ఇల్లంతా పూలతో డెకరేట్‌ చేసేవాళ్లం, ముగ్గులేసేవాళ్లం. ఈ దీపావళికీ చుట్టాలు, స్నేహితులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. దీపావళికి అమ్మ లడ్డూలు, మూంగ్‌ దాల్‌కి హల్వా వంటి స్వీట్స్, పూరి చోలె, కాలి మా కి దాల్‌ వంటి ఫుడ్‌ కుక్‌ చేస్తారు. అవన్నీ లాగించేస్తా. ఎక్కువమంది దీపావళికి క్రాకర్స్‌ కాలుస్తుంటారు. కానీ, నేనెప్పుడూ కాల్చలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top