మనసుకి మేకప్‌ వేయకూడదు

Kajal Aggarwal goes make-up free to share an important message - Sakshi

‘‘మేకప్‌ బాహ్య సౌందర్యాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని కాదు. నిజంగా మనల్ని మనం అంగీకరించడంలోనే నిజమైన అందం దాగి ఉంది’’ అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. వెండితెరపై ఎన్నో గ్లామరస్‌ పాత్రలు చేసి కుర్రకారు గుండెల్లో గుబులు రేపారు కాజల్‌. ఇప్పటికీ అదే అందంతో వెండితెరపై కనిపిస్తున్నారు. కానీ సినిమాల్లోని పాత్రల కోసమే తాను మేకప్‌ వేసుకుంటున్నానని, మేకప్‌ మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయకూడదని ఆమె అంటున్నారు. అలాగే తాను మేకప్‌ లేకుండా ఉన్న ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ– ‘‘బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రపంచంలో ఉన్నాం మనం.

నార్సిజం (తన అందాన్ని చూసుకుని తానే మురిసిపోవడం) ప్రతిచోటా ఉంటుంది. సౌందర్య సాధనాల కోసం మనం లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ బాహ్య సౌందర్యం మనల్ని నిర్వచించకూడదు. మన అందాన్ని మనం అంగీకరించినప్పుడే నిజంగా హ్యాపీగా ఉండగలం. అందుకే మనసుకి మేకప్‌ వేయకూడదు’’ అని చెప్పుకొచ్చారు కాజల్‌. తమిళంలో ప్యారిస్‌ ప్యారిస్, కోమలి సినిమాల షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన కాజల్‌ తెలుగులో ‘రణరంగం’ సినిమాకు ప్యాకప్‌ చెప్పారు. ఇటు హీరోయిన్‌గా ‘ఇండియన్‌ 2’ సినిమాతో పాటు. అటు నిర్మాతగానూ ఎదగాలనే ప్రయత్నాల్లో కాజల్‌ బిజీ బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top