నన్ను మీతో ఉండనివ్వండి!

Kajal aggarwal Fan Massages in Instagram - Sakshi

తమిళ సినిమా: సాధారణంగా వయసు పెరిగిన కొద్దీ అందం తగ్గుతూ వస్తుంది. ఇది సహజం. అయితే కాజల్‌ అగర్వాల్‌ లాంటి కొందరు తారలకు ఇది భిన్నం అనిపిస్తోంది. కాజల్‌ తన వయసుతో పాటు అందాన్ని పెంచుకుంటూపోతోంది. తెలుగు, తమిళ్, హిందీ అంటూ పలు భాషల్లో నటిగా వెలిగిపోతున్న ఈ బ్యూటీ 2004లోనే హిందీ చిత్ర రంగంలో నటిగా తెరంగేట్రం చేసింది. ఇక టాలీవుడ్‌కు 2007లో లక్ష్మీకల్యాణం చిత్రంతో పరిచయమైంది. అలా చూసుకున్నా కథానాయకిగా పుష్కర కాలంలోకి అడుగుపెట్టింది. ఈ పంజాబీ బ్యూటీ 33 ఏళ్ల ప్రౌఢ వయసుకు చేరుకుందంటే నమ్మశక్యం కాదు. కారణం తను శారీరక అందానికి ఇస్తున్న ప్రాధాన్యతనే. కథానాయకిగా అందలం ఎక్కినా, ఆహార నియమాలను కచ్చితంగా పాఠిస్తూ, శారీరక వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తుండడమేనని తనే ఒక భేటీలో చెప్పింది. కాగా  ఇప్పటికీ గ్లామరస్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ దాన్ని గుర్తు చేసే విధంగా తరచూ ఫొటో సెషన్‌ చేయించుకుని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

అలా తాజాగా డబుల్‌ స్విట్‌ అనే కొత్త ఫ్యాషన్‌ దుస్తులను ధరించి ఫొటోలు దిగి వాటిని ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ఒక ఫొటోనూ కాజల్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. దానికి అభిమానుల నుంచి రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి. అందంగా ఉన్నావని కొందరు అంటుంటే క్రిష్‌ అనే ఒక అభిమాని మాత్రం ‘ప్రియమైన తల్లీ దయ చేసి జాగ్రత్తగా ఉండు. రాజకీయాల్లోని అవినీతిపరులు చాలా ప్రమాదకరమైనవాళ్లు. నిన్ను, నన్ను కిందకు తోసేస్తారు. హెచ్చరికతో ఉండమ్మా. త్వరగా రండి నన్ను మనువాడండి. ఎప్పుడూ నన్ను మీతో ఉండనివ్వండి’ అంటూ అర్థం లేకుండా పేర్కొన్నాడు. అతడి చర్యలు కాజల్‌కు అర్థం కాలేదట. అతడు వేరే వాళ్లకు పోస్ట్‌ చేయాల్సిన దాన్ని తనకు చేశాడా అనే అయోమయానికి గురైందట. అంతే మరి అభిమానులన్నాక అందరూ ఒకేలా ఉండరు. కాజల్‌ అర్థం చేసుకోవాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top