అలాంటి వ్యక్తినే చేసుకుంటా!

Kajal Aggarwal Comment On Marriage In Paris Paris Promotion - Sakshi

తమిళసినిమా: సినిమాకు సంబంధం లేని వాడినే పెళ్లి చేసుకుంటానని నటి కాజల్‌అగర్వాల్‌ చెప్పింది. మొత్తం మీద పెళ్లిపై ఈ అమ్మడికి దృష్టి మళ్లిందన్నమాట. వయసు 33. సినిమా వయసు 10 ఏళ్లపైనే. నటించిన చిత్రాలు 50కి పైనే. టాలీవుడ్‌లో స్టార్‌ డమ్‌ తీసుకొచ్చిన చిత్రం మగధీర. అయితే కోలీవుడ్‌లో హిట్స్‌ ఉన్నాయి గానీ, ఇంకా చెప్పుకోదగ్గ చిత్రం అమరలేదు. బహుశ తాజాగా నటిస్తున్న ఇండియన్‌–2 కాజల్‌అగర్వాల్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోతుందేమో. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ నమ్ముకుంది కూడా కోలీవుడ్‌నే. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్‌ చిత్రం తమిళ్‌ రీమేక్‌లో నటిస్తున్న ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ప్రస్తుతం ఇండియన్‌–2, కోమలి చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత పెళ్లికి సిద్ధమవ్వాలనే ఆలోచనలో కాజల్‌ అగర్వాల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ ఓ ఇంటిదై చాలా కాలమైంది. ఆమెకు ఒక బిడ్డ కూడా. దీంతో ఇటీవల ఇండియన్‌–2 చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన కాజల్‌అగర్వాల్‌ అందరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారని, చేతి నిండా చిత్రాలు ఉండడం వల్లే తాను పెళ్లిపై దృష్టి పెట్టలేదని చెప్పింది. అయితే తనకు సినిమా రంగంలో అందరూ స్నేహితులేనని, అందుకే సినిమాకు సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇది చూస్తే ఈ అమ్మడు ఎవరినో ప్రేమిస్తున్నట్లు అనిపించడం లేదూ. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు విదేశీ అబ్బాయిలనే సెలెక్ట్‌ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారన్నది గమనార్హం. అలాగే కాజల్‌ కూడా ఏ విదేశీ వ్యక్తితోనో ప్రేమల్లో పడి ఉండవచ్చు. చూద్దాం కాజల్‌కు కాబోయో భర్త ఎవరవుతాడో.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top