హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

Kajal Agarwal Ready To Act In Hollywood - Sakshi

చెన్నై :  కాజల్‌ హాలీవుడ్‌ ఎంట్రీ షూరూ అయ్యిందన్నది తాజా సమాచారం. దక్షిణాది భామలు, ఉత్తరాది బ్యూటీలు హాలీవుడ్‌పై మక్కువ పెంచుకోవడం తాజా ట్రెండ్‌. బాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి అమెరికాకు చెందిన సింగర్‌ నిక్‌ జోనాస్‌ను ప్రేమించి పెళ్లాడటమే కాకండా అక్కడే సెటిల్‌ అయిపోయింది. ఇక నటి ఐశ్వర్యారాయ్, దీపిక పదుకునే వంటి బ్యూటీస్‌ హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నటుడు ధనుష్‌ ‘ది ఎక్సాట్రార్డినరీ జర్నీ’ చిత్రంతో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేశాడు. అదే విధంగా నటుడు నెపోలియన్‌ అమెరికాలో మకాం పెట్టి హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. నటి రాధికా ఆప్తే అలాగే. శ్రుతీహాసన్‌ త్వరలో హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లో నటించడానికి రెడీ అవుతోంది. అనుష్క నటిస్తున్న సైలెన్స్‌ ఆంగ్లంలోనూ రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ అమ్మడికీ హాలీవుడ్‌ ఆశ పుట్టినట్లు ఇటీవలే వెల్లడించింది. తాజాగా దక్షిణాదిలో పాపులర్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న మరో ఉత్తరాది బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యిందని తెలిసింది. తెలుగు, తమిళం భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌అగర్వాల్‌ అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే అక్కడ మాత్రం సరైన హిట్‌ ఈ అమ్మడి ఖాతాలో పడలేదు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ అవకాశమే కాజల్‌ను వరించినట్లు తాజా సమాచారం. ఒక ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించడానికి ఎంపికైనట్లు తెలిసింది. ఈ చిత్రం ఆంగ్లం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానునట్లు టాక్‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తం మీద పెళ్లిని వాయిదా వేసుకుంటూ సినిమాల పైనే దృష్టి సారిస్తున్న కాజల్‌అగర్వాల్‌కు త్వరలో హాలీవుడ్‌ ముచ్చట తీరనుందన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top