రొమాన్స్‌ మూడ్‌లో కాజల్‌

Kajal Agarwal Holiday Trip With Family And Boyfriend in Maldives - Sakshi

సినిమా: నటి కాజల్‌అగర్వాల్‌ ఇప్పుడు ఫుల్‌ రొమాన్స్‌ మూడ్‌లో ఉందనిపిస్తోంది. విహారయాత్రలో బాయ్‌ఫ్రెండ్‌తో యమ ఖుషీగా గడిపేస్తోంది. బొమ్మలాట్టం చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముంబాయి చిన్నది కాజల్‌అగర్వాల్‌. అయితే తన భరత్‌తో నటించిన పళని చిత్రం ముందుగా తెరపైకి వచ్చింది. అలా మొదలైన ఈ అమ్మడి కోలీవుడ్‌ సినీ కెరీర్‌ తుపాకీ, జిల్లా వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. అదేవిధంగా తెలుగులోనూ స్టార్‌ హీరోలతో నటించి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్‌కు జంటగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేవిధంగా హిందీలో జాన్‌ అబ్రహాంతో జతకట్టిన ముంబై సాగా చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఇవి మినహా దక్షిణాదిలో గానీ, ఉత్తరాదిలో గానీ మరో అవకాశం లేదు. అయితే అప్పుడెప్పుడో నటించిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. త్వరలో దానికి మోక్షం కలగబోతోందనే ప్రచారం జరుగుతోంది.

#ridingflamingos

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

మొత్తం మీద ఇంతకు ముందు నటిగా క్షణం తీరికలేకుండా నటించిన కాజల్‌అగర్వాల్‌కు ఇప్పుడు అది కావలసినంత దొరికేసింది. దీంతో ఇటీవల కుటుంబసభ్యులతో మాల్‌దీవులకు జాలీ ట్రిప్‌ వేసేసింది. అక్కడ రిసార్ట్‌లో తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇకపోతే ఈ అమ్మడు ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త ప్రేమలో పడినట్లు, త్వరలో అతనితో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా పనిలో పనిగా ఈ జంట జాలీగా చక్కర్లు కొట్టేస్తున్నారు. కాజల్‌ ఎక్కడికి వెళ్లినా ఆమెను బాయ్‌ఫ్రెండ్‌ ఫాలో అవుతున్నాడని సమాచారం. దీంతో వీరిద్దరూ యమ జాలీగా తిరిగేస్తున్నారు. అలా సమీప కాలంలో ఒక క్రీడా మైదానంలోకి ప్రియుడితో వెళ్లింది. అక్కడ మంచి రొమాంటిక్‌ మూడ్‌లో కాజల్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ భుజాలపైకి ఎక్కేసి తెగ ఎంజాయ్‌ చేసేసింది.

ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు ప్రియుడు కాజల్‌తో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలా కాజల్‌ తన కుదిరిన ఖాళీ సమయాన్ని ప్రియుడితో మధురాతి మధురంగా గడిపేస్తోందన్న మాట. ఇప్పటి వరకూ కాజల్‌ ప్రేమలో పడ్డట్టు ప్రచారం జరుగుతుందే గానీ, అతని ఫొటో ఎక్కడా బయటకు రాలేదు. ఇప్పుడు అతను కాజల్‌తో తన్మయత్తంగా ఉన్న ఫొటో వెలుగులోకి వచ్చింది. అన్నట్లు ఈ అమ్మడు కమలహాసన్‌తో ఇండియన్‌–2 చిత్రంలో నటించనుందన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నా, ఇప్పటికీ ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొనే సమయం ఆమెకు రాలేదట. ఆ సమయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు కాజల్‌అగర్వాల్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top