నేనూ  అదే కోరుకుంటున్నా!

Kajal Agarwal Exclusive Special Interview - Sakshi

తమిళసినిమా: నేనూ అదే కోరుకుంటున్నానంటోంది నటి కాజల్‌అగర్వాల్‌. ఇంతకీ ఈ అమ్మడు కోరుకునేదేమిటి? ఏమా కథ. చూసేస్తే పోలా! నటి కాజల్‌అగర్వాల్‌ టాప్‌ హీరోయినే. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో టాప్‌ హీరోలతో నటించేసింది. నటిగా ఆఫ్‌ సెంచరీ దాటేసింది కూడా. అయినా మునుపెన్నడూ లేనంత హుషారుగా ఉందట. కారణం ఏమిటమ్మా? అంటే కమలహాసన్‌ సరసన ఇండియన్‌–2 చిత్రంలో నటించనున్నానుగా అని బదులిచ్చింది. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇక సెంట్రిక్‌ కథా పాత్రలో నటించిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం తెరపైకి రావాల్సి ఉంది. ఇది హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్‌ చిత్రానికి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. తాజాగా జయంరవికి జంటగా కోమాలి చిత్రంలో నటిస్తోంది.

కాగా త్వరలో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా కాజల్‌అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించడం గర్వంగా ఉందని చెప్పారు. తనను నటిగా పెంచి పోషించిన తమిళం, తెలుగు సినీపరిశ్రమకు సమానంగా చూస్తానని అంది. అభిమానులకు తాను నచ్చానని, ఒక నటిగా ఇంకా తనను తాను ఎలా మెరుగుపరచుకోవాలని ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. తన వరకూ అభిమానుల అభినందనలే ముఖ్యం అని చెప్పారు.

అందుకోసం ఇంకా శ్రమించడానికి తయార్‌ అని పేర్కొన్నారు. కమలహాసన్‌కు జంటగా నటించడం గొప్ప విషయంగా భావిస్తున్నానని అన్నారు. మనసులో దృడమైన విశ్వాసం ఉంటే ఏదైనా జరిగి తీరుతుందన్నారు. శ్రమించే గుణం, సహనం ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చునని పేర్కొన్నారు. సినిమా రంగంలో తృప్తి అన్నది ఎవరికీ ఉండని.. కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉందని చెప్పింది. మనం ఆశించిన అవకాశాలు రాకపోయినా సహనంగా వేచి ఉండాలని అన్నారు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన వరకూ కథానాయకి ముఖ్యత్వం ఉన్న పాత్రలను ఆశిస్తున్నానని చెప్పారు. కాస్త ఆలస్యమైనా అలాంటి పాత్రలకే ప్రాధాన్యత నివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అదే విధంగా సినిమాలోనే కొనసాగాలన్నదే తన కోరిక అని కాజల్‌అగర్వాల్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top