న్యూలుక్ తో జూనియర్ ఎన్టీఆర్ 'రభస'

న్యూలుక్ తో జూనియర్ ఎన్టీఆర్ 'రభస'


యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్తో 'రభస' చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. తన తాజా చిత్రంలో నూతన కేశాలంకరణతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న హెయిర్ స్టయిల్స్తో అలరించనున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు.ఒకదానికొకటి సంబంధం లేని మూడు విభిన్న కోణాల్లో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని, ప్లే బాయ్ తరహా పాత్ర. యువతరానికి మాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని దర్శకడు ఐఏఎన్ఎస్తో చెప్పాడు. కాగా హెయిర్ స్టయిల్కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు.రభస పక్కా కమర్షియల్ చిత్రమని, అయితే ఫ్యామిలీ ప్రేక్షకులకు కావలసిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉంటాయని సంతోష్ శ్రీనివాస్  తెలిపాడు. ఈ చిత్రం ‘కందిరీగ’కి సీక్వెల్ కాదని,   ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న 'రభస'కు ఎలాంటి పోలిక లేదన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్  స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకుంటున్నామని...  ఈ చిత్రంలో ఎన్టీఆర్ యూత్ కి ఐకాన్ లా కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ శైలికి తగినట్టు కథ రాసుకోవడానికి తనకు ఆరు నెలలు పట్టిందని, కథ ఎన్టీఆర్కు చాలా నచ్చిందని సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు. ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ సరసన సమంత, రుతూ ప్రభు నటిస్తున్నారు.  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్య'  షూటింగ్లో బిజీ గా ఉన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top