తన అకౌంట్‌ హ్యాక్‌ అయిందన్న జూనియర్‌ బిగ్‌బీ

Junior Amitabh Bachchan Tiktok Account Was Hacked - Sakshi

టిక్‌టాక్‌లో జూనియర్‌ సెలబ్రిటీలకు కొదవే లేదు. అచ్చంగా సినిమా హీరోహీరోయిన్‌ల వేషధారణతో పాటు వారి హావభావాలను పలికిస్తూ పాపులారిటీ సంపాదించుకుంటారీ బుల్లి సెలబ్రిటీలు. పుణెకు చెందిన శశింకాంత్‌ పెద్వాల్‌.. రూపంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను తలపిస్తాడు. అంతేకాదు.. అతని గొంతును కూడా అనుకరిస్తూ ఎన్నో వీడియోలు చేస్తుంటాడు. గత వీడియోలో శశికాంత్‌.. బిగ్‌బీని తలదన్నేలా డైలాగ్‌ను పలకగా ఆ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఈ వీడియోలో శశికాంత్‌ అచ్చంగా అమితాబ్‌ను పోలి ఉండటంతో క్షణంపాటు తత్తరపాటుకు లోనైన నెటిజన్లు అతని వీడియోకు విశేషంగా ఆకర్షితులయ్యారు.

ఇక తాజాగా శశికాంత్‌ తన అకౌంట్‌ హ్యాక్‌కు గురైందని పేర్కొన్నాడు. తనను ఎంతగానో ఆదరిస్తున్న అభిమానులు.. హ్యాకర్ల బారిన పడిన అకౌంట్‌ను ఫాలో అవకండని సూచించాడు.  ఇక ఈ మధ్య టిక్‌టాక్‌లో కాస్త పాపులర్‌ కాగానే వారి అకౌంట్లు హ్యాక్‌ కావడం సర్వసాధారణమైపోయింది. కాగా టిక్‌టాక్‌లో ఈ మధ్యే ఓ యూజర్‌ బాబా జాక్సన్‌.. హృతిక్‌ రోషన్‌ డ్యాన్స్‌ స్టెప్పులు అనుకరించే వీడియో విపరీతంగా వైరల్‌ అయింది. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో పాటు పలువురు సినీప్రముఖులు అతని ప్రతిభను కొనియాడారు. ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ సైతం అతని వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే.

చదవండి: టిక్‌టాక్‌లో ఈ చాలెంజ్‌ వీడియో ప్రమాదకరం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top