టార్గెట్‌ 18

Jr NTR to lose weight for Trivikram movie - Sakshi

హెడ్డింగ్‌ చూసి తారక్‌ (చిన్న ఎన్టీఆర్‌) తన నెక్ట్స్‌ సినిమాలో 18 ఏళ్ళ యువకుడి పాత్ర చేస్తున్నాడేమో అనుకుంటున్నారా? కాదు, పోని 2018లో ఏదైనా టార్గెట్‌ చేశాడేమో అని ఊహిస్తున్నారా? అదీ కాదు.  విషయం ఏంటంటే తారక్‌ బరువు తగ్గుతున్నారట. అవునా? స్లిమ్‌గానే ఉంటారు కదా. ఎందుకు సన్నబడాలనుకుంటున్నారు? అంటే.. ఏ సినిమా ఆర్టిస్ట్‌ అయినా సన్నబడాలనుకోవడం, బరువు పెరగాలనుకోవడం... ఏదైనా సినిమా కోసమే. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌తో తాను చేయనున్న సినిమా కోసమే బరువు తగ్గాలనుకుంటున్నారు.‘ఎన్టీఆర్‌ సన్నబడుతున్నారట’ అనే వార్త అక్కడక్కడా వినపడుతోంది. కానీ, ఎంత తగ్గుతున్నారు? అనేది ఎవరికీ తెలియదు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘18 కిలోలు’ తగ్గుతున్నారట. ఎన్టీఆర్‌ కెరీర్‌ని పరిశీలిస్తే.. ‘యమదొంగ’ సినిమా అప్పుడు బాగా తగ్గిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి అదే ఫిజిక్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్నారు. కొంచెం అటూ ఇటూగా వెయిట్‌ ఉంటుంది తప్ప పెద్ద మార్పేం లేదు. దాదాపు పదకొండేళ్ల క్రితం తగ్గినట్లు.. ఇప్పుడు మళ్లీ తగ్గే పనిలో ఉన్నారు. 18 అంటే అంత ఈజీ కాదు. ఎన్టీఆర్‌కి సినిమా అంటే ప్యాషన్‌. ఏమైనా చేస్తారు. ఎంత కష్టమైనా త్రివిక్రమ్‌కి కావల్సినట్లు మౌల్డ్‌ అయిపోతారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఫారిన్‌లో హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు ఎన్టీఆర్‌. త్రివిక్రమ్‌ సినిమా జనవరి చివరి వారంలో ప్రారంభమవుతుంది. తగ్గిన తారక్‌ ఎలా ఉంటారో అప్పుడు తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top