‘జయదేవ్‌ లేని లోటు నాకు తీరనిది’

Jr NTR Condolence To His Fan Jayadev Death - Sakshi

హీరోలకు అభిమానులే దేవుళ్లు.. అభిమానులకు హీరోలే ప్రత్యక్ష దైవాలు. అందులోనూ తెలుగు నాట హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే సంబంధమే ప్రత్యేకం. సినీ హీరోలు తమ అభిమానుల కోసం.. అభిమానులు తమ హీరోల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. మొదటి అడుగు వేసినప్పటి నుంచి ఉన్న అభిమానులపై హీరోలు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతారు. ఇలా తన ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ తనతో ప్రయాణం చేసిన ఓ అభిమాని మృతి పట్ల జూ.ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

‘నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్  చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను’ అని అభిమాని మృతిపట్ల విచారణ వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top