ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి | 'Jee Karda' singer Labh Janjua found dead in his Mumbai apartment | Sakshi
Sakshi News home page

ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి

Oct 23 2015 10:36 AM | Updated on Apr 3 2019 7:03 PM

ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి - Sakshi

ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లాభ్ జాంజ్వా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ముంబయి: బాలీవుడ్ ప్రముఖ సింగర్ లాభ్ జాంజ్వా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబయిలోని గూర్గావ్ లోగల బంగుర్ నగర్ కాలనీలోని తన అపార్ట్ మెంట్లో చనిపోయి కనిపించారు. ఆయన భాంగ్రా హిట్స్తో పేరు సంపాధించారు. ఆయన స్వరం అద్భుతంగా ఉంటుంది.

జీ కర్దా, లండన్ తుమక్దా, ముందియాన్ టు బచ్ కే, షారుఖ్ ఖాన్ చిత్రం రబ్ దే బనాది జోడీలోని డ్యాన్స్ పే చాన్స్ అంటూ ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఉర్రూతలూరిస్తాయి. కాగా, లాభ్ జాంజ్వా మృతిపట్ల ఒక్కసారిగా బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ కంపోజర్ ప్రీతం తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి సంతాప సందేశం రాయాల్సి వస్తుందని తాను అస్సలు ఊహించలేదని, తన స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement