నీకు గర్ల్‌ఫ్రెండ్‌ అవసరమా?

Jasleen Matharu Father Defends Her Over Dating With Anup Jalota - Sakshi

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 12 సీజన్‌ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘విచిత్ర జోడీస్‌’ థీమ్‌తో ఈ సీజన్‌ అలరించనుంది. కాగా అధ్యాత్మిక గీతాలు, భజనలతో ప్రసిద్ధి చెందిన అనూప్‌ జలోథా తన శిష్యురాలు, గర్ల్‌ఫ్రెండ్‌ జస్లీన్‌ మథారుతో కలిసి హౌజ్‌లో అడుగుపెట్టారు. వీరిద్దరికీ దాదాపు 35 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో... ‘ఇంత లేటు వయసులో నీకు గర్ల్‌ఫ్రెండ్‌ అవసరమా? అధ్యాత్మిక వేత్తవై జనాలకు చెప్పేది ఇదేనా? అంటూ అనూప్‌ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన జస్లీన్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టగానే నా కూతురు గురించి వస్తున్న నెగటివ్‌ కామెంట్స్‌ వింటున్నాను. అయితే అవన్నీ అవాస్తవాలు. ఒకవేళ నిజమైనా నా కూతురు స్వయంగా ఆ విషయం చెప్పేంత వరకు నేను నమ్మను. ప్రస్తుతం తను గెలుపుపై దృష్టి సారించాలి. అయినా నా కూతురికి కావాల్సినన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తనేం తప్పు చేయలేదు’ అంటూ కూతురిని సమర్థించారు. కాగా తాను అనూప్‌ మూడేళ్లుగా డేటింగ్‌ చేస్తున్నామని.. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలియదని జస్లీన్‌ అన్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు మరింత దగ్గరగా గమనిస్తానని.. అప్పుడే తమ బంధం ఎంత బలమైందో.. ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పగలనంటూ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top