రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

Istamga Movie First Look Poster release - Sakshi

అర్జున్‌ మహి, తనిష్క్‌ రాజన్‌ జంటగా సంపత్‌ వి.రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్టంగా’. ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర చేశారు. ఎ.వి.ఆర్‌. మూవీ వండర్స్‌ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. సంపత్‌ .వి మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నేటి జనరేషన్‌లో ప్రేమకున్న ఇంపార్టెన్స్‌ ఏంటి? ఎంత విలువ ఇవ్వాలి? అనే కథాంశంతో రూపొందింది.

ఔట్‌ అండ్‌ ఔట్‌ యూత్‌ఫుల్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు అడ్డూరి వెంకటేశ్వర రావు. దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేశ్వర్‌ నెమిలకొండ, ఫిష్‌ వెంకట్‌  తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహావీర్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top